7 కి.మీ డోలీలో మోసుకెళ్లినా ప్రాణం దక్కలేదు (వీడియో)

51చూసినవారు
అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంగళవారం పెదకోట పంచాయతీ మడ్రేబు గ్రామానికి చెందిన చిలకమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యానికి గురి కావడంతో డోలీలో మోస్తూ 7 కి.మీ నడిచి దేవరపల్లి ఆసుపత్రికి తరలించారు. అయినా ప్రాణం దక్కలేదు. తమ ఊర్లకు సరైన రోడ్లు లేకపోవడం వల్ల గతంలోనూ అనేక మంది చనిపోయారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైన అధికారులు స్పందించి రోడ్లు వేయాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్