పర్యాటక రంగంలో ప్రజాప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం HYDలోని హైటెక్స్‌లో నిర్వహించిన ట్రవెర్నియా ఫెస్ట్ కు చీఫ్ గెస్ట్‌గా మంత్రి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేసిందన్నారు. పర్యాటకులతో పాటు జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు రాష్ట్రానికి వచ్చే వారిని పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు అనేక పథకాలు చేపడుతున్నామన్నారు.