తెలంగాణలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై సెక్రటరియేట్ లో DRDOలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే అయిదు మాసాల్లో చేయాల్సిన పనులపై సమీక్షించారు. మార్చి లోపు ఉపాధి హామీ పనుల కోసం రూ. 1,372 కోట్ల నిధులు ఖర్చుచేయాలన్నారు. మహిళలకు ఉపాధి భరోసా, పంట పొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వచ్చ భారత్ మిషన్ కోసం ఉపాధి నిధులు వెచ్చించాలని సూచించారు.