భారత మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కొత్త బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్ ఆపరేషన్స్ మెంటార్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఏసీఏ కార్యదర్శి ధ్రువీకరించారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించడం, వారిని మెరికల్లా తీర్చిదిద్దడం ఆమె విధి. ఈ ఒప్పందం మూడేళ్లు కొనసాగనుంది. కాగా, అనంతపురంలో ఏర్పాటు చేసే అకాడమీలో మిథాలీ రాజ్ క్రీడాకారులకు శిక్షణ ఇస్తారని ఏసీఏ సెక్రటరీ సతీష్ బాబు తెలిపారు.