బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. దీని కోసం బీఆర్ఎస్‌తో పాటు జాగృతి సైతం ప్రణాళికలు రూపొందిస్తున్నది. తెలంగాణ అస్తిత్వం, బతుకమ్మ, రైతు, మహిళా, బీసీ అంశాలే ప్రధాన ఎజెండాతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టూర్‌లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధం చేయాలనే కాన్సెప్ట్‌తో కవిత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించన్నట్లు సమాచారం.