ఎమ్మెల్సీ రిజల్ట్స్.. మొదలైన కౌంటింగ్ ప్రాసెస్

59చూసినవారు
వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రాసెస్ మొదలయ్యింది. ఈ ఉప ఎన్నికలో 52మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. మే 27న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగ్గా.. 605 పోలింగ్ స్టేషన్లలో 3,36,013ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లు లెక్కించడానికి 2800 మంది అధికారులను నియమించారు. ప్రతి 25 ఓట్లకు ఒక బండిల్‌గా కట్టనున్నారు.