ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల ఉక్రెయిన్ దేశంలో పర్యటించారు. అక్కడి ప్రభుత్వానికి సంఘర్షణ ప్రాంతాలు, విపత్తు ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన మందులు వైద్య పరికరాలు, సామగ్రితో కూడిన నాలుగు 'BHISHM' (భారత్ హెల్త్ ఇనీషియేటివ్ ఫర్ సహయోగ్ హితా అండ్ మైత్రి) క్యూబ్‌లను అందించారు. ఈ క్యూబ్‌లు 20 కిలోల వరకు బరువు ఉంటాయి. 1991లో ఈ దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోడీ ఘనత సాధించారు.