కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. సన్న బియ్యం వడ్లు కొన్న రెండు రోజులకే రైతుల ఖాతాల్లో రూ. 500 బోనస్ పడతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రకటించారు. కొనుగోళ్ల సమయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతన్నల కోసం కాంగ్రెస్ సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఆమె తెలిపారు. ఇకపోతే సన్న బియ్యం వడ్లు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.