ఆటో డ్రైవర్ పై దాడి చేసిన వడ్డీ వ్యాపారి అరెస్ట్ (వీడియో)

1033చూసినవారు
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మ్యాతరి రవి అనే వడ్డీ వ్యాపారి రాజీవ్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బాలయ్యకు రూ.5 వేలు అప్పు ఇచ్చాడు. అసలు వడ్డీతో కలిపి రూ.6.500 అయింది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆటో డ్రైవర్ పై వడ్డీ వ్యాపారి మ్యాతరి రవి దాడికి పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు వడ్డివ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆటో డ్రైవర్ ను పిడిగుద్దులు గుద్దిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.