ఆర్టీసీ బస్సులో మహిళకు పురుడు పోసిన కండక్టర్

65చూసినవారు
ఆర్టీసీ బస్సులో మహిళకు పురుడు పోసిన కండక్టర్
హైదరాబాద్‌లో ఆరంఘర్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ప్రసవం చేసి లేడీ కండక్టర్ సరోజ మానవత్వం చాటుకున్నారు. కండక్టర్ సరోజ బస్సును రోడ్డు పక్కన ఆపించి తోటి మహిళా ప్రయాణికుల సాయంతో ఆమెకు బస్సులోనే ప్రసవం చేశారు. సదరు మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. అదే బస్సులో తల్లీబిడ్డలను సురక్షితంగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్