ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ గ్రూపు మధ్య గత పది నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా తూర్పు గాజాలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ సేనలు భీకర దాడులు జరిపారు. ఈ ఘటనలో ఏకంగా 100 మందికి పైగా మృతి చెందారు. ఇది భయంకరమైన ఊచకోత అని, పలువురు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారని హమాస్ అధికార ప్రతినిధి మొహమూద్ బసల్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు.