అక్రమ అమ్మకాల్లో ఎక్కువగా ఆడపిల్లలు.. కన్నవారికి అంత భారమా!

58చూసినవారు
అక్రమ అమ్మకాల్లో ఎక్కువగా ఆడపిల్లలు.. కన్నవారికి అంత భారమా!
బంజారాహిల్స్ కు చెందిన దంపతులకు 15 ఏళ్లుగా పిల్లలు లేకపోవడంతో 3 రోజుల వయసున్న పాపను అక్రమంగా కొనుగోలు చేశారు. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఏడాదిన్నర తరువాత ఆ చిన్నారిని పోలీసులు స్వాధీనం చేసుకొని శిశు విహార్ కు తరలించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పిల్లల్లో ఎక్కువమంది ఆడపిల్లలే ఉన్నారు. పిల్లల్ని అక్రమంగా కొనుగోలు చేసిన వారిలో 16 మంది తెలంగాణ వాసులు, 9 మంది ఏపీ వాసులున్నారు.