మునాగాకు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మునగాకు ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తినిపెంచుతాయి. సీజనల్ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. మునగాకులోని ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.