మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన చపాతి మేకర్, రోడ్డు రోలర్ గుర్తులకు 4281 ఓట్లు పడ్డాయి. అచ్చం కారు గుర్తులాగే అవి ఉండటంతో వృద్దులు ఎక్కువగా వాటికి ఓటేశారు. చపాతి మేకర్‌కు 2407 ఓట్లు రాగా, రోడ్డు రోలర్‌కు 1874 వచ్చాయి. దుబ్బాక ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీని చపాతీ మేకర్ దెబ్బకొట్టిన విషయం తెలిసిందే.