అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ పూర్తి మద్ధతు ప్రకటించారు. ఈమేరకు ఆయన ట్రంప్ ప్రచారానికి నెల నెలా 45 మిలియన్ డాలర్లు(రూ.376 కోట్లు) ఇవ్వనున్నారని అక్కడి మీడియా తెలిపింది. ట్రంప్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న పీఏసీకి ఆయన ఈ డొనేషన్ అందజేస్తారని వెల్లడించింది. కాగా ట్రంప్‌కు గానీ, బైడెన్‌కు గానీ తాను ఆర్థిక సాయం చేయనని గతంలో మస్క్ ప్రకటించారు.