సోషల్ మీడియాలో కలకలం రేపిన ఏపీ బీజేపీ నేతల నగ్న వీడియోల ఎఫెక్ట్ వారి పదవులపై పడింది. గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్‌ల నగ్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయింది. వారిపై అంతర్గత విచారణ జరిపి, గురువారం రాజీనామాలు చేయించింది. సదరు వీడియోల్లో ఉన్న బీజేపీ మహిళా నేతను పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.