భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ఎంఎస్ ధోనీపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడి అంతర్జాతీయ కెరీర్‌ను జీవితాన్ని ధోనీ సర్వ నాశనం చేశాడని యోగ్‌రాజ్ ఓ వీడియోలో అన్నాడు. ఆయన ఆరోపణల నేపథ్యంలో యూవీ తన తండ్రి గురించి మాట్లాడిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందులో యువరాజ్.. మా నాన్న మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పాడు.