వేధించిన వ్యక్తిని నడిరోడ్డుపై కొట్టింది (వీడియో)

72చూసినవారు
తనను వేధించిన ఓ వ్యక్తికి ఓ మహిళ నడిరోడ్డుపై తగిన బుద్ధి చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మీరట్‌లోని లిసాడి గేట్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఓ మహిళ పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఓ వ్యక్తి వేధించాడు. దీంతో మహిళ వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకుని జనం ఎదుటే కొట్టడం ప్రారంభించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఖుషాల్ కాలనీ వాసిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్