వాహనదారులు రోడ్డుపై వాహనాలు నిలిపితే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్సై జగన్ మోహన్ హెచ్చరించారు. గురువారం లింగాల మండల కేంద్రంలోనీ ఏకలవ్య కూడలిలో వాహనదారులు, స్థానిక వ్యాపారస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొందరు వాహనదారులు రోడ్లపై వాహనాలను నిలిపి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని హెచ్చరించారు. స్థానికంగా ఉన్న వ్యాపారులు తమ వ్యాపార సముదాయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.