అచ్చంపేట: రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అచ్చంపేట మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ నాలుగవ రాష్ట్ర మహాసభల గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోమవారం సీపీఐఎం అచ్చంపేట మండల కార్యదర్శి ఎస్ మల్లేష్ మాట్లాడారు. ఈనెల 25 నుంచి 28 వరకు సిపిఐ ఎం నాల్గవ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతాయన్నారు.