ఖాతాలో నుంచి రూ.1.20లక్షల నగదు మాయం
కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో ఉన్న సూర్యలత కాటన్ మిల్లులో పనిచేసే కుశేంద్ర కుమార్ మొబైల్ కు యూనియన్ బ్యాంకు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని మెసేజ్ వచ్చింది. నిజమే అని నమ్మి లింకు ద్వారా యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నాడు. కొద్ది నిమిషాల్లోనే బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.20 లక్షలను కాజేశారు. దీంతో శుక్రవారం బాధితుడు పిఎస్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.