తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్వకుర్తి పీఏసీఎస్ పరిధిలోని కల్వకుర్తి, ఊరుకొండ మండలాలలోని రైతులతో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు పిఎసిఎస్ చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేసి 257 మంది రైతులు ఏకగ్రీవంగా వారు సాగు చేసే ప్రతి ఎకరానికి ఎటువంటి నిబంధనలు లేకుండా రైతు భరోసాను సకాలంలో అందించి రైతులను ఆదుకోవాలని తీర్మానించడం జరిగింది.