Dec 13, 2024, 08:12 IST/
అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్
Dec 13, 2024, 08:12 IST
జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఎక్స్ వేదికగా.. ‘తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు. అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని ఓ సాధారణ నేరస్థుడిగా భావించి ఇలా చేయొద్దు. జాతీయ అవార్డు గ్రహీతను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’ అని పోస్టు పెట్టారు.