సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే బన్ని తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి దీనిని అత్యవసర పిటిషన్‌గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర పిటిషన్‌ను ఉదయం 10.30 గంటలకే మెన్షన్ చేయాలి కదాని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. సోమవారం విచారణ చేస్తామని స్పష్టం చేసింది.