సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన నిరవధిక దీక్షలు రెండవ రోజుకు చేరుకుంది. శుక్రవారం నారాయణపేట పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వినతి పత్రాన్ని అందించారు. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.