ఒకే ఏడాది 4 ప్రభుత్వ ఉద్యోగాలు
ఒక్క ప్రభుత్వం ఉద్యోగం రావడమే గగనం. అలాంటిది చందంపేట మండలం గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన బూడిద ఆంజనేయులు ఏకంగా ఒకే ఏడాది నాలుగు ఉద్యోగాలు సాధించాడు. గురుకుల జేఎల్, టీజీటీ ఉద్యోగాలతో పాటు డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ జిల్లా 5వ ర్యాంకు, ఎల్పీ 8వ ర్యాంకు సాధించారు. ఇప్పటికే ఆంజనేయులు జేఎల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.