Feb 25, 2025, 09:02 IST/
ఇందిరమ్మ రాజ్యం.. పోలీసు రాజ్యమైంది: హరీష్ రావు
Feb 25, 2025, 09:02 IST
TG: ఇందిరమ్మ రాజ్యం.. పోలీసు రాజ్యమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తమ కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు, వేధింపులు సాధారణమైపోయాయని అన్నారు. తమ ఆరోపణలు వాస్తవమని కాంగ్రెస్ నాయకుడైన చిన్నారెడ్డి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నదని ట్వీట్ చేశారు. 'పోలీసులు కాంగ్రెస్ MLAల ఇంటి కావలి కారుల్లాగా.. కేసు పెట్టుమంటే పెట్టాలె, తీసేయమంటే తీసేయాలె అనే స్థాయికి దిగజారారు' అని హరీష్ తెలిపారు.