అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ మృతి
చందంపేట మండలం తెల్దేవరపల్లి గ్రామానికి చెందిన సపావట్ రమేష్ (27) తనకున్న ఎకరం భూమితో పాటు మరో ఐదెకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేసాడు. వర్షం సకాలంలో అనుకూలించక, పంటను కాపుడుకొనే ప్రయత్నంలో ఇటీవల తన వ్యవసాయం పొలంలో దాదాపు 6 బోర్ లు వేసాడు. అప్పు తీర్చే మార్గం లేక తన వ్యవసాయ పొలంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకోగా గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.