చౌటుప్పల్: ఆర్టీసీ బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు
చౌటుప్పల్ మండలం బొర్రోళ్ల గూడెం స్టేజ్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ డిపోకు చెందిన ఎక్స్ ప్రెస్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. బస్సులో మొత్తం 48 ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణం అతివేగమే అని ప్రయాణికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.