మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్లగొండ అర్జాలభావిలో తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడన్స్‌లో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి మూడంచెల శిక్షణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ డమ్మీ ఈవీఎంలతో నిర్వహించిన మాక్ కౌంటింగ్ విజయవంతమైంది. ఒకే హాల్‌లో 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో ఓట్లను లెక్కించి, ఫలితాలను విడుదల చేయనున్నారు. తొలి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెలువడనుంది. మునుగోడు ఫలితంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.