రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆటోను కారు ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.