డిండి ప్రాజెక్టు నీటిని వృద్ద చేయొద్దని చందంపేట ఎంపీపీ నున్సావత్ పార్వతి సోమవారం డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ డిండి ప్రాజెక్టు నుండి వస్తున్న నీళ్లును కిందికి వదలడం వల్ల కృష్ణ బ్యాక్ వాటర్ లో కలిసి వృధా అవుతుందని చందంపేట మండలంలో ఉన్న చాలా చెరువుల కుంటలలో నీళ్లు లేవని అందుకె డిండి ప్రాజెక్టు నుండి గతంలో తీసిన కాలువల ద్వారా నీళ్లును విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే డిండి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి బ్రిడ్జి పైనుండి అలుగు పోస్తుంది ఆమె అన్నారు. ప్రాజెక్టు నీళ్ళ తో చెరువుల కుంటలు నింపడం ద్వారా రైతుల పొలాల్లో బోర్లు, బావిలు గ్రౌండ్ వాటర్ పెరుగుతాయని ఆమె అన్నారు. ఉన్నత స్థాయి ప్రాజెక్టు అధికారులు చొరవ తీసుకుని చందంపేట మండలంలో ఉన్న చెరువులు, కుంటల. ప్రాజెక్టు నీళ్లుతో నింపాలని ఆమె పేర్కొన్నారు.