పిడుగుపడి ఎద్దు మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చందంపేట మండలంలోని యల్మల మంద గ్రామపంచాయతీ పరిధిలోని దేవరచెర్ల తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవరచెర్ల తండాకు చెందిన కేతవత్ రాము నాయక్ ఎప్పటిలాగే తన ఇంటి ముందు ఎద్దులను కట్టేసి ఉన్నాడు. ఆదివారం సాయంత్రం ఉరుముల మెరుపులతో కురిసిన వర్షానికి పిడుగుపడి కాడెద్దు మృతి చెందింది. బాధిత రైతును స్థానిక ఎంపీటీసీ కోటి లక్ష్ము నాయక్ పరామర్శించారు. విత్తనాలు వేసే సమయంలో కాడెద్దు మృతి చెందడం బాధకరమన్నారు. రైతు కు టుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.