దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కానీ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని రోజుకు ఓ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుతున్నారని తెలిపారు. ఈ సంబరాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని వాటి విషయంపై ప్రజలకు వివరించాలన్నారు.