పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఈదులగూడెం సుందరయ్య చౌరస్తా వద్ద ధర్నా చేయడంతో పాటు కూరగాయలు గ్యాస్ బండను ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశం అంటుతున్నాయని సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితిలో నెలకొందన్నారు.