కార్యకర్తల నాయకుడు చకిలం

81చూసినవారు
కార్యకర్తల నాయకుడు చకిలం
కార్యకర్తల నాయకుడు సర్దార్ చకిలం శ్రీనివాస్ రావు పంతులని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్ అన్నారు. బుధవారం చకిలం 29వవర్ధంతి పురస్కరించుకొని ఏరియాఆసుపత్రితో పాటు మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద అన్నదానం చేసి మాట్లాడారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి సర్దార్ గా పిలువబడిన గొప్పనాయకుడు శ్రీనివాస రావు అని, ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో చకిలం అనిల్ కుమార్, సునీల్ కుమార్, రామలింగయ్య, రంగారావు, రోశయ్య, ఖాదర్, మధు, ఉదయ భాస్కర్, అశోక్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :