చాలా మంది రైతులు కరెంట్ సమస్యలు వస్తే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఏమవుతుందిలే అన్న ధోరణిలో సొంతంగా మరమ్మతులు చేస్తుంటారు. అది సరికాదు. కరెంట్ స్టార్టర్లకు కచ్చితంగా తలుపులు అమర్చుకోవాలి. మోటర్లపై మందపాటి ప్లాస్టిక్ కవర్‌ను కప్పి ఉంచాలి. లేదంటే వర్షానికి తడిసి ఒక ఫేస్ తీగ కాలితే మోటర్ మొత్తానికి విద్యుత్ సరఫరా అవుతుంది. దానిని తాకగానే షాక్ కొడుతుంది.