విధానాలపై పని చేసే వారిని చట్టసభలకు పంపించాలని.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పూటకో పార్టీ రోజుకో పార్టీ మారే నాయకులు తయారయ్యారని, ప్రజా సంక్షేమాన్ని మరిచి సొంత స్వలాభం కోసం స్వార్థం కోసం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొందని ప్రజలు అయోమయంలో ఉన్నారని చెప్పారు. పార్టీల నాయకుల తీరు అసహ్యించుకునే రీతిలో ఉందని విమర్శించారు.