Mar 08, 2025, 02:03 IST/
గుడ్‌న్యూస్.. వారికి 90శాతం వడ్డీ మాఫీ
Mar 08, 2025, 02:03 IST
TG: పాత బకాయిలను వసూలు చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. ఆస్తి పన్నులు వసూళ్ల విషయంలో ఓటీఎస్‌కు అనుమతినివ్వాలని జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఓటీఎస్ అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో పాత బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ కానుంది. ఆ మేరకు జీహెచ్ఎంసీ, పట్టణాభివృద్ధి అధికారి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.