నటి రన్యారావుకు ఏమి జరిగింది?.. ఫోటో వైరల్

73చూసినవారు
నటి రన్యారావుకు ఏమి జరిగింది?.. ఫోటో వైరల్
దుబాయ్ నుంచి 14.8 కిలోల బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ డీఆర్‌ఐ అధికారులకు చిక్కిన కన్నడ నటి రన్యారావుకు కోర్టు 3 రోజుల డీఆర్ఐ కస్టడీని విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రన్యారావుకు చెందిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఆ ఫోటోలో కనిపిస్తోంది. దీంతో ఆమెకు ఏమి జరిగింది? విచారణ పేరుతో ఆమెపై దాడి జరిగిందా? అంటూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్