హోలీకి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR) పెంపును ప్రకటించే అవకాశం ఉంది. దీని వల్ల 1.2 కోట్ల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈసారి డీఏ పెంపు 2 శాతం వరకు ఉండొచ్చని సమాచారం. ప్రభుత్వం ఏటా రెండుసార్లు డీఏను సమీక్షిస్తుంది. జనవరి సవరణ సాధారణంగా మార్చిలో జరిగితే.. జూలై సవరణ అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రకటిస్తారు.