నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సోమవారం ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శ్రీ గోదాదేవి, రంగనాధ స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతం విశిష్టతను గురించి వివరించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు.