Feb 17, 2025, 04:02 IST/
దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
Feb 17, 2025, 04:02 IST
కర్ణాటకలోని మైసూరులో విషాద ఘటన వెలుగుచూసింది. విశ్వేశ్వర్ నగర్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. చేతన్ (45), భార్య రూపాలి (43) కుమారుడు కుశాల్ (15) మరియు చేతన్ తల్లి ప్రియంవద (63) ఇంట్లోనే విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.