AP: కూటమి ప్రభుత్వం త్వరలోనే ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయనుంది. ఈ స్కీమ్ ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేల చొప్పున ప్రభుత్వం అందజేయనుంది. తాజాగా ఈ పథకం అమలుకు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు కీలక అప్‌డేట్ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అమలు చేస్తామని మంత్రి నిమ్మల చెప్పారు.