నల్లగొండ జిల్లా కనగల్ మండలం బొమ్మపల్లి, తిమ్మన్నగూడెం, లింగోటం, కనగల్ వాగులో చుక్క నీళ్ళు లేక రైతులు నాట్లు వేయాలో వద్దో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈ వాగుకు ఎడవెల్లి చెరువు ద్వారా నీళ్లు ఇస్తే బాగుంటుంది. 15 రోజులపాటు వాటర్ వదిలితే మూడు నెలల దాకా రైతులకు వాగు నీళ్ళు అందిస్తుంది అని రైతులు తెలిపారు.