ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులన్నీటిని వెంటనే పూర్తిచేయాలి

53చూసినవారు
ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులన్నీటిని వెంటనే పూర్తిచేయాలి
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులన్నీటిని వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె తన చాంబర్లో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు, విద్యార్థులకు దుస్తుల పంపిణీ పై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న దృష్ట్యా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్