రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

76చూసినవారు
రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
సౌత్ సెంట్రల్ రైల్వే లో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల అమలు చేయాలని, బోనస్ చెల్లించాలని మరియు అన్నిరకాల కార్మికచట్టాలను అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 22న జరుగు రాష్ట్ర సదస్సులు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ రైల్వే స్టేషన్ లో తెలంగాణ రైల్వే క్యాజువల్, సిఐటియు పిలుపుమేరకు కార్మికుల సమస్యలపై సర్వే నిర్వహించారు.