నల్గొండలో తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి సబ్ జూనియర్, క్యాడేట్ కేటగిరిలో బాల బాలికలకు జిల్లా స్థాయిలో సన్ లైట్ టైక్వాండో అకాడమీ జిల్లా సెక్రెటరీ సిహెచ్ అనిల్ కుమార్ పోటీలను నిర్వహించడం జరిగింది. గెలుపొందిన క్రీడాకారులు ఈనెల 19వ తారీఖు నుండి 21 తేదీ వరకు మంచిర్యాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మహిళా పోలీస్ ఎస్సై విజయభాయి పాల్గొని క్రీడాకారులను అభినందించారు.