నల్గొండ: తమకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్ చేయాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వరకు బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న తమను, ఎన్నికల సమయంలో రెగ్యులర్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడని, హామీని నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరుతున్నారు.