కారు ఢీ... యాదయ్యకు తీవ్ర గాయాలు
నార్కట్ పల్లి మండలం గోపాలయపల్లి గ్రామానికి చెందిన దండిగా యాదయ్య మంగళవారం చిట్యాలకు పని నిమిత్తం వెళ్లి, పని ముగించుకుని తన గ్రామానికి వెళ్ళడానికి జాతీయ రహదారి దాటుతుండగా హైదరాబాద్ నుండి నార్కట్ పల్లి వైపు ఫాస్ట్ గ వెళ్తున్న కారు వచ్చి ఢీ కొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు.